CTR: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గారితో భేటీ అయ్యారు. గురువారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి చిత్తూరు నగర అభివృద్ధిపై చర్చించారు. ప్రధానంగా రహదారుల విస్తరణ, భూయజమానుల సమస్యల పరిష్కారం, పరిహారం, రహదారుల అభివృద్ధి పనుల వేగవంతంపై చర్చించారు.