TPT: కర్నూలు జిల్లాలో గురువారం జరిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రధానమంత్రి పర్యటనలో భాగస్వాములైయ్యారు. ఇందులో భాగంగా కర్నూలు హెలిపాడ్ వద్ద ప్రధాని మోదీకి తిరుగు ప్రయాణంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వీడ్కోలు పలికారు.