NZB: ఈ నెల 6న మహ్మదీయ కాలనీలో మహ్మద్ సాబిర్ పాషా ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును చేధించినట్లు సీఐ శ్రీనివాస్ రాజ్ తెలిపారు. నగరంలోని 2వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాధితుడి అన్న షఫీ పాషా వ్యాపారంలో నష్టాలు రావడంతో తమ్ముడి వద్ద ఉన్న సొమ్ముపై కన్నేసి చోరికి పాల్పడ్డాడన్నారు.