HYD: ఈనెల 18న జరిగే తెలంగాణ బంద్కు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థి, బహుజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ మాట్లాడుతూ.. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని, బీసీలు ఉద్యమించే సమయం ఆసన్నమైందన్నారు.