AP: విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి దేవస్థానం నూతన క్యాలెండర్ను ఛైర్మన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవానీ దీక్షా విరమణల షెడ్యూల్ విడుదల చేశారు. నవంబర్ 1 నుంచి దుర్గమ్మ మండల దీక్షాధారణలు.. నవంబర్ 21 నుంచి అర్ధమండల దీక్షాధారణలు ప్రారంభమవుతాయని తెలిపారు. డిసెంబర్ 4న కలశజ్యోతి ఉత్సవం, డిసెంబర్ 11 నుంచి 15 వరకు భవానీ దీక్షల విరమణలు ఉంటాయని వివరించారు.