VSP: రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ గురువారం హెచ్చరించారు. ప్రతి ఇంటి నుంచి రోజువారీ చెత్తను క్లాప్ వాహనాలకు మాత్రమే అప్పగించి, నగర పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలన్నారు. గురువారం 17, 20, 22, 29 వార్డుల్లో ఆయన పర్యటించారు.