MDK: మెదక్ జిల్లా చేగుంట, సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలాలకు చెందిన మహిళ రైతులు శుక్రవారం సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు లోని ఇక్రిసాట్ సంస్థను సందర్శించారు. ఎస్ఎమ్ సెహగల్ ఫౌండేషన్, హైటెక్ ప్రాజెక్టు సహకారంతో ఇక్రిసాట్ కు వెళ్లారు. తక్కువ స్థలంలో పెరటి తోటల పెంపకం, డ్రిప్ సహాయంతో నీరు అందించడం తదితర అంశాలను పరిశీలించారు