VZM: ఆయిల్ పామ్ సాగు అన్ని పంటల కన్నా లాభదాయకమని కలెక్టర్ రాం సుందర్ రెడ్డి అన్నారు. విజయనగరం రూరల్ మండలంలోని కొండకరకాంలో సాగు అవుతున్న ఆయిల్ పామ్ తోటను కలెక్టర్ ఇవాళ సందర్శించారు. అక్కడ రైతులతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయిల్ పామ్ సాగుపై ప్రభుత్వం అందిస్తున్న రాయితీ, బిందు సేద్యం వలన లాభాలను వివరించారు.