TPT: రంగారెడ్డికి చెందిన జూలకంటి రామ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.11,11,111 విరాళంగా అందించారు. ఈ మేరకు దాత తిరుపతిలోని టీటీడీ అదనపు ఈవో భవనం వద్ద అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. అనంతరం విరాళం అందజేసిన దాతను, కుటుంబ సభ్యులను అదనపు ఈవో అభినందించారు.