మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఈరోజు న్యూజిలాండ్ కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. శ్రీలంకలోని కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. సెమీ ఫైనల్ రేసులో నిలవాలంటే న్యూజిలాండ్‌కు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. ఇందులో ఓడితే సెమీస్ నుంచి దాదాపు నిష్క్రమించినట్లే. మరోవైపు పాక్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి తప్పుకుంది.