MBNR: అక్టోబర్ 18న బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తలపెట్టిన బీసీ బంద్కు బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం మద్దతు ప్రకటించింది. 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు నిర్వహిస్తున్న ఈ బంద్కు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం వెంటనే బీసీ బిల్లు ఆమోదానికి చర్యలు తీసుకోవాలని ఫోరం ఆదేశించారు.