NLG: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం శనివారం తలపెట్టిన రాష్ట్ర బంద్‌ను జయప్రదం చేయాలని బీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బందుకు ప్రజలంతా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మంద కృష్ణ మాదిగ, అద్దంకి దయాకర్, కోదండరాం తదితరులు పాల్గొన్నారు.