SKLM: మెడికల్ కాలేజీలలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణతో కూటమి ప్రభుత్వంపై ప్రజలకు అవగాహన కల్పించాలని YCP సమన్వయకర్త రవికుమార్ పిలుపునిచ్చారు. అమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపురం, పాత ఆమదాలవలసలో శుక్రవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ కోసం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆయన అన్నారు.