CTR: సదుం మండలంలోని ఎంజేపీ గురుకుల పాఠశాల విద్యార్థులు కబడ్డీ పోటీలలో ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసుల రెడ్డి శుక్రవారం తెలిపారు. చౌడేపల్లె మండలం చారాలలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి కబడ్డీ పోటీలలో అండర్ 17 విభాగంలో యోగేశ్, 14 విభాగంలో వంశీ ప్రతిభ చూపి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆయన చెప్పారు.