JN: నూతన ఓటర్లకు గుర్తింపు కార్డులు తపాలా శాఖ ద్వారా పంపిణీ చేయాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్ లతో గురువారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. 100 ఏళ్లు పైబడిన ఓటర్ల వివరాలను ఆధారాలతో సమర్పించాలని అధికారులకు సూచించారు. ఫారం 6, 7, 8 దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.