BHPL: జిల్లా ఐడిఓసీలో ఇవాళ MLA గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ, SP కిరణ్ ఖారే ఆధ్వర్యంలో వివిధ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. ఇసుక రవాణాలో పర్యవేక్షణ లోపం రావొద్దని, కఠినంగా వ్యవహరించాలని అధికారులను ఆదేశించారు. నంబర్ ప్లేట్లు లేని వాహనాలను తక్షణం సీజ్ చేయాలని, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిగా పెట్టాలన్నారు.