NLR: విడవలూరు పీఎసీఎస్ పరిధిలో ప్రతి ఒక్క రైతుకి యూరియాని పంపిణీ చేస్తామని విడవలూరు పీఏసీఎస్ ఛైర్పర్సన్ పొన్నలూరు పురంధర్ రెడ్డి తెలిపారు. కోవూరు ఆదేశాల మేరకు సొసైటీకీ వచ్చిన యూరియాని రైతులకు గురువారం అయన అందజేశారు. ఈ సందర్భంగా పురంధర్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టాదారు, కౌలు దారు, శివాయి భూములు ఉన్న రైతులకు ఎకరాకీ మూడు బస్తాలు చొప్పున అందజేస్తామన్నారు.