ADB: విద్యార్థులకు దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవలు అందించడంలో NCC పాత్ర కీలకమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని పోలీస్ శిక్షణ కేంద్రంలో గురువారం రాత్రి నిర్వహించిన NCC సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశ భవిష్యత్తులో యువత ముందుండాలన్నారు. విద్యార్థులు చదువుతోపాటు కళలు, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ ప్రతిభ చూపించాలని కోరారు.