అఫ్గాన్‌తో ODI సిరీస్‌లో బంగ్లాదేశ్ 0-3 తేడాతో క్లీన్ స్వీప్ అవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటికే ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వెల్లువెత్తుతుండగా.. తాజాగా స్వదేశానికి చేరుకున్న ప్లేయర్ల కార్లపై దాడి జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. అయితే ఆటలో ఓడటం సహజమని మహ్మద్ నయిమ్ సహా పలువురు ప్లేయర్లు అభిమానులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.