ELR: దీపావళి పండుగ సమయంలో ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చిన్నపిల్లలు బాణాసంచా కాల్చే సమయంలో పెద్దలు పర్యవేక్షించాలన్నారు. అలాగే జనసంచారం ప్రాంతాల్లో బాణాసంచా కాల్చరాదన్నారు. బాణసంచా కాల్చే సమయంలో నీరు, ఇసుక బకెట్ దగ్గర ఉంచుకోవాలన్నారు. కాటన్ బట్టలు ధరించాలన్నారు.