GDWL: ఓపెన్ టెన్త్, ఇంటర్ (2025-26)లో చదవడానికి ఆసక్తి గలవారు అక్టోబర్ 23 వరకు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓపెన్ సొసైటీ (టాస్) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియట్ (2025-26) విద్యా సంవత్సరానికి జిల్లాలో 1780 మందికి అవకాశం కల్పించారని తెలిపారు.