AP: విశాఖపట్నం గాజువాకలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నవవధువు మృతి చెందింది. ఉమాదేవి తన భర్త రాజుతో స్కూటీపై వెళ్తుండగా కూర్మన్నపాలెం జంక్షన్ సమీపంలో.. స్కూటీని అతివేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె మరణించగా.. రాజుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు రాజును ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.