NLR: వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం గ్రామంలోని అంగన్వాడీ సెంటర్లో గురువారం పోషణ్ మాసోత్సవం ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. సూపర్వైజర్ సునీత, MLHP జి. అనూష, స్కూల్ టీచర్ శాంతి మాట్లాడుతూ.. బాల్యం నుంచి వృద్ధుల వరకు ఊబకాయం నివారణకు, ఆకుకూరలు, కూరగాయలు, మిల్లెట్స్ వినియోగం పెంచుకోవాలన్నారు. పిల్లలకు ఆటలు, శారీరక వ్యాయామం అలవాటు చేయాలని సూచించారు.