MBNR: పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ప్రొఫెసర్ జీ.ఎన్.శ్రీనివాస్ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తైంది. ఈ ఏడాదిలో వర్శిటీ విద్యా, పరిపాలనా రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించింది. వీసీ బాధ్యతలు చేపట్టిన వెంటనే నాక్ (NAAC) గ్రేడింగ్ కు వెళ్లడం, లా కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజీలను స్థాపించడం వంటి కీలక చర్యలు చేపట్టారు.