ప్రకాశం: అనుమతి లేకుండా బాణసంచాలను విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఒంగోలులోని ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని పోలీస్ అధికారులు, సిబ్బంది విస్తృత తనిఖీలను చేపట్టారు.