KMM: బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది బీజేపీనేనని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు విమర్శించారు. శనివారం ఖమ్మం నగరంలో నిర్వహించిన బీసీ బంద్‌లో భాగంగా అఖిలపక్ష నేతలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనే అంశానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ బంద్‌లో అన్ని పార్టీల నేతలు పాల్గొన్నారు.