NTR: బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. విజయవాడ విజయ టాకీస్ వద్ద క్లీనింగ్ పని చేసే శారద, ఈ నెల 16న రాత్రి విధులు ముగించుకుని ఒంటరిగా ఇంటికి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వెంబడించారు. వెంటనే ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.