KNR: కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్లో శుక్రవారం షీ టీం పనిచేయు విధానంపై అభ్యర్థులకు అవగాహన కల్పించారు. మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీలత మాట్లాడుతూ.. మహిళల రక్షణ కోసమే షీ టీంలు ఉన్నాయని, సైబర్ నేరాలు, డయల్ 100 వంటి పలు విషయాలపై అవగాహన కల్పించారు. మహిళల పట్ల ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే షీ టీంకు ఫిర్యాదు చేయాలని సూచించారు.