NGKL: వెల్దండ మండలం తిమ్మినోనిపల్లి తండాలో శనివారం విద్యుత్ షాక్తో కాడెద్దు మృతి చెందింది. వడ్త్యవత్ పకీర అనే రైతుకు చెందిన ఎద్దు వ్యవసాయ పొలంలో మేస్తుండగా, ప్రమాదవశాత్తూ విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మరణించింది. దాదాపు రూ.70 వేల విలువైన ఎద్దు మృతి చెందడంతో రైతు ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.