KDP: తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు డాక్టర్ గవాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో సేవ్ ది గర్ల్ చైల్డ్ అవగాహన కార్యక్రమాన్ని శనివారం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మల్లయ్య నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆడపిల్లల నిష్పత్తి పెంచాలన్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరు సమానమని, బేటీ బచావో బేటీ పడావో, పోషణా అభియాన్, బాలిక ఆరోగ్యం, సమానత్వ హక్కులను వివరించారు.