TG: గ్రూప్-2 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో Dy CM భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇంత మందికి ఒకేసారి నియామక పత్రాలు అందించిన దాఖలాలు లేవు. పదేళ్ల పాలనలో ఇలా ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు. మేము కూడా ఇవ్వకూడదని అడ్డంకులు సృష్టించారు. యువత ఆశలు నెరవేర్చడం మా ప్రజా ప్రభుత్వ లక్ష్యం. అందుకే పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేశాము’ అని భట్టి చెప్పారు.