PLD: నరసరావుపేటలో గాడిపర్తి ఎఫ్రాన్ (31) అనే కాటికాపరి శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. స్వర్గపురిలో పనిచేస్తున్న ఎఫ్రాన్ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో నరికి చంపారు. క్రిస్టియన్పాలెం వాసి అయిన ఇతని హత్యకు పాత కక్షలే కారణమని బంధువులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.