సత్యసాయి: శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్, టీఏఎఫ్ఈ సంస్థ ఛైర్పర్సన్ మల్లికా శ్రీనివాసన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. నవంబర్లో జరగనున్న సత్య సాయిబాబా శతజయంతి వేడుకలకు రాష్ట్రపతిని ఆహ్వానించారు. ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా బాబా ట్రస్ట్ సేవలను రాష్ట్రపతి ప్రశంసించారు.