W.G: భీమవరంలోని శ్రీపద్మావతి వేంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 205 రోజులకు గాను రూ.9,81,930లు వచ్చాయని ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు తెలిపారు. హుండీ లెక్కింపులో ఆలయ ఛైర్మన్ మంతెన రామ్ కుమార్ రాజు, దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖీదారుడు వర్దినీడి వెంకటేశ్వరరావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.