TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నవంబర్ 11న నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ప్రస్తుతం జూబ్లీహిల్స్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. నవంబర్ 11న పోలింగ్, 14న కౌంటింగ్ చేయనున్నారు.