BHNG: రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. ఇవాళ రామన్నపేటతో పాటు బోగారం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ప్రభుత్వం మద్దతు ధర అందిస్తున్నందున రైతులు దళారులను నమ్మి మోసపోకుండా IKP సెంటర్ కే ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.