BHNG: గ్రామాల్లో శాంతి భద్రతలను పటిష్ఠం చేసేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగ పడుతాయని యాదగిరిగుట్ట రూరల్ సీఐ శంకర్ గౌడ్ అన్నారు. మోటకొండూర్ మండలంలోని ఇక్కుర్తి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై మోటకొండూర్ ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామస్తులకు అవగాహన సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఉంటే నేరాలను సులభంగా నియంత్రించవచ్చునన్నారు.