GNTR: కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గురువారం రాత్రి ఓ వ్యక్తి బైక్పై వచ్చి కొమ్మమూరు కాల్వ వంతెనపై నుంచి కాల్వలోకి దూకాడు. మృతదేహం అప్పాపురం ప్రాంతం వద్ద లభ్యమైంది. మృతుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేక ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయాడా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.