HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్, ఓట్ల లెక్కింపు నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో వచ్చేనెల 10, 11, 14వ తేదీల్లో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోలింగ్, ఓట్ల లెక్కింపు కేంద్రాలున్న కార్యాలయాలు, సంస్థలకు పెయిడ్ హాలిడే ప్రకటించారు.