వెండి కొనేవారికి గుడ్న్యూస్. ధన త్రయోదశి సందర్భంగా ఇవాళ సిల్వర్ ధర బాగా తగ్గింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండిపై ఏకంగా రూ.13 వేలు తగ్గి రూ.1,90,000కు చేరింది. అలాగే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,910 తగ్గి రూ.1,30,860గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,750 పతనమై రూ.1,19,950కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉన్నాయి.