NGKL: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ బీసీ సంఘాల ఆధ్వర్యంలో శనివారం కల్వకుర్తి బంద్ చేపట్టారు. ఈ నేపథ్యంలో సీఐ నాగార్జున బంద్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. నిరసన శాంతియుత వాతవరణంలో జరగాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను ఎట్టి పరిస్థితిలో ధ్వంసం చేయవద్దని అన్నారు.