MDK: మనోహరాబాద్ మండలం డీలాయ్ ప్రాథమిక పాఠశాలను శుక్రవారం జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ పునః ప్రారంభించారు. పదేళ్ల క్రితం పాఠశాలలో విద్యార్థులు లేక మూతపడింది. విద్యార్థులు వస్తుండడంతో తిరిగి ఇద్దరు ఉపాధ్యాయులను డిప్యూటేషన్‌పై ఏర్పాటు చేయగా, పాఠశాల పునః ప్రారంభమైంది. ప్రమిద స్వచ్ఛంద సంస్థ విద్యార్థులకు స్కూల్ బ్యాగులను, నోట్ బుక్స్ అందజేసింది.