SRD: నారాయణఖేడ్‌లో న్యాయవాది చంద్రశేఖర్‌పై దాడికి నిరసనగా జిల్లా కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి శుక్రవారం నిరసన చేపట్టారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవాదులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాద చట్టాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.