NLG: పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా TG పోలీస్ శాఖ రాష్ట్రస్థాయిలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలను నిర్వహిస్తోంది. పోలీసుల స్పందన, సేవలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ పోటీలు ఉద్దేశించబడ్డాయి. అక్టోబర్ 23 లోపు ఫోటోలను, షార్ట్ ఫిల్మ్స్ను పోలీస్ కార్యాలయంలో సమర్పించాలని ఎస్పీ శరత్ చంద్ర తెలిపారు.