WNP: బీసీలకు 42%రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీని వ్యతిరేకించాలని పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చీర్ల చందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్త బంద్‌లో భాగంగా శనివారం ఉదయం పార్టీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్సు డిపో ఎదుట నిరసనచేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానికసంస్థల ఎన్నికలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనే సంకల్పంతో కాంగ్రెస్ ముందుకు వెళుతుందన్నారు.