దేశవ్యాప్తంగా సెప్టెంబరులో నిరుద్యోగిత రేటు కాస్త పెరిగింది. ఆగస్టులో 5.1శాతంగా ఉంటే.. సెప్టెంబరులో 5.2 శాతానికి పెరిగింది. 15 ఏళ్లు, అంతకుమించి వయసులోని వారికి సంబంధించి ఉపాధి వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళిక అమలు శాఖ ప్రతి నెలా విడుదల చేస్తుంటుంది. అందులో నిరుద్యోగ రేటు పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళల్లో ఎక్కువగా ఉంది.