BDK: వాతావరణానికి అనుగుణంగా హైబ్రిడ్ విత్తనాలు, సరైన సాంకేతిక పద్ధతులను వినియోగించడం ద్వారా ఆయిల్‌పామ్ పంట నష్టాన్ని సమర్థవంతంగా తగ్గించుకోవచ్చని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు సూచించారు. శుక్రవారం నారావారిగూడెంలో నూనె గింజల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఆయిల్‌పామ్ విత్తన నాటింపు, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.