SKLM: కొత్తూరు మండల తహసీల్దార్ బాలకృష్ణను వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేయాలని మండల దళిత నాయకులు కోరారు. ఈ సందర్భంగా వారు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనలు తెలిపారు. ఇటీవల నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మార్వో ప్రోటోకాల్ పాటించకపోవడంతో అనేక వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అశోక్ కుమార్, ఎండు నాయుడు ఉన్నారు.