కోనసీమ: రావులపాలెం బస్టాండ్ అభివృద్ధి, వాడపల్లి బస్టాండ్ నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే బండారు సత్యానందారావు ఆర్టీసీ అధికారులతో చర్చించారు. శుక్రవారం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాఘవ కుమార్, డిపో మేనేజర్ కుమార్ రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారును కలిశారు. వాడపల్లిలో భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని వారు ఎమ్మెల్యేను కోరారు.