ADB: ఆదివాసుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా అన్నారు. శుక్రవారం ఉట్నూర్ పరిధిలోని దంతన్‌పల్లి గ్రామంలో కొలాంగుడలో ఏర్పాటు చేసిన కొమురం సూరు 28వ వర్ధంతి సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమానికి హాజరై సూరు విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.